Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రీడాకారులను అవమానిస్తారా.. వైసీపీపై చిత్తూరు ఎమ్మెల్యే జగన్‌ మోహన్ ఫైర్

    క్రీడాకారులను అవమానిస్తారా.. వైసీపీపై చిత్తూరు ఎమ్మెల్యే జగన్‌ మోహన్ ఫైర్

    చిత్తూరు ( రాజనీతి ):సంవత్సరాల తరబడి కష్టపడి క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానించడం సరికాదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ అన్నారు. సోమవారం శాప్ కార్యాలయం వద్ద అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసేందుకు వచ్చిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిబంధనల ప్రకారమే క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి మూడు శాతం ఉద్యోగాలు కేటాయించారని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. రాజకీయ స్వలాభం కోసం వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. క్రీడా కోటా ద్వారా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారి ధ్రువపత్రాలను నకిలీవిగా పేర్కొనడం క్రీడాలోకాన్ని విస్మయానికి గురిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. క్రీడాకారులు, ఉపాధ్యాయులపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలను సహించేది లేదని ఎమ్మెల్యే జగన్‌ మోహన్ స్పష్టం చేశారు.