Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎం కుప్పం పర్యటనలో చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్ అభివృద్ధి అంశాల ప్రస్తావన

    సీఎం కుప్పం పర్యటనలో చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌ మోహన్ అభివృద్ధి అంశాల ప్రస్తావన

    చిత్తూరు (రాజనీతి): రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్‌లో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు, జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ ప్రగతికి ప్రాధాన్యమిస్తూ సమన్వయంతో పనిచేస్తామని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, టీడీపీ ముఖ్య నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.