Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 600 ఎకరాల ప్రభుత్వ భూములపై ఎమ్మెల్యే మౌనం వీడాలి

    Author RAJANEETHI | 21 Sep 2026, 06:00 PM | ANDHRA PRADESH
    600 ఎకరాల ప్రభుత్వ భూములపై ఎమ్మెల్యే మౌనం వీడాలి

    మదనపల్లె, సెప్టెంబరు 21 (రాజనీతి): పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, అక్రమ లేఅవుట్లు, దళితుల భూముల పరిరక్షణపై ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి స్పందించాలని మాదిగ దళ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి చంద్రయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూములపై గతంలో సర్వేలు జరిగాయని, లోకాయుక్త విచారణలు కూడా జరిగాయని పేర్కొన్నారు. సంబంధిత రికార్డులను బహిర్గతం చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. దళితుల భూములు, ఆయిల్‌సీడ్‌ భూములు, అక్రమ లేఅవుట్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చర్యలు లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.