Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి

    Author RAJANEETHI | 20 Sep 2026, 08:55 PM | ANDHRA PRADESH
    డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి

    పీలేరు, సెప్టెంబరు 20 (రాజనీతి): పీలేరు పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డీసీసీ వైస్‌చైర్మన్‌ దుబ్బా శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలపై నిర్మాణాలు, ఆక్రమణలతో మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాల సమయంలో డ్రైనేజీలు పొంగిపొర్లి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పీలేరు ఈవో క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మురుగునీరు సక్రమంగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.