Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బూరగపల్లి మంచినీటి సమస్యను పరిష్కరించాలి

    Author RAJANEETHI | 20 Sep 2026, 08:31 PM | ANDHRA PRADESH
    బూరగపల్లి మంచినీటి సమస్యను పరిష్కరించాలి

    చౌడేపల్లి, సెప్టెంబరు 20 (రాజనీతి): అమినిగుంట పంచాయతీ పరిధిలోని బూరగపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని జనసేన మండల నాయకుడు గందోడి చరణ్‌రాయల్‌ కోరారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలన్నరగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. బోరులో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సమస్య తలెత్తిందన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రత్యామ్నాయ బోరు వేసే వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చరణ్‌రాయల్‌ తెలిపారు.