Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలకడలో వైసీపీకి షాక్.. 200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరిక

    Author RAJANEETHI | 20 Sep 2026, 06:02 PM | ANDHRA PRADESH
    కలకడలో వైసీపీకి షాక్.. 200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరిక

    కలకడ, సెప్టెంబరు 20 (రాజనీతి): కలకడ పట్టణంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ దండు జిలాని, మాజీ సింగిల్‌ విండో డైరెక్టర్‌ సుల్తానితో పాటు సుమారు 200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే నల్లారి తెలిపారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు పార్టీలో చేరడంతో కలకడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

    కలకడలో వైసీపీకి షాక్.. 200 ముస్లిం మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరిక - Additional Image