Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినతులు వస్తే చాలు.. యాక్షన్‌లోకి చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్!

    వినతులు వస్తే చాలు.. యాక్షన్‌లోకి చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్!

    చిత్తూరు ( రాజనీతి ) డైలీ దినపత్రిక: ప్రజల నుంచి అందే వినతులను వేగంగా నాణ్యతతో పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నీటి సమస్యలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతులపై వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్‌లో మొత్తం 37 వినతులు అందాయి.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ మేయర్ అముద, మున్సిపల్ ఎంఈ చంద్రశేఖర్ రెడ్డి, తహశీల్దార్లు కళ్యాణి, తులసి, ఎంపీడీవో శ్రీనివాసులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.