Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫ్రైడే డ్రైడే, కుష్ఠు వ్యాధిపై అవగాహన

    Author RAJANEETHI | 18 Sep 2026, 01:40 PM | ANDHRA PRADESH
    ఫ్రైడే డ్రైడే, కుష్ఠు వ్యాధిపై అవగాహన

    మదనపల్లి, సెప్టెంబరు 18 (రాజనీతి): సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా రామారావు కాలనీలోని బాపూజీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఫ్రైడే డ్రైడే, కుష్ఠు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ రఫీ మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ తదితర వ్యాధుల నియంత్రణకు ప్రతి శుక్రవారం నీటి నిల్వలను ఖాళీ చేసి ఎండబెట్టాలని సూచించారు. కుష్ఠు లక్షణాలను తొలిదశలో గుర్తిస్తే ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. విద్యార్థులకు స్క్రీనింగ్‌ నిర్వహించి, ఆరోగ్య సందేశాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    ఫ్రైడే డ్రైడే, కుష్ఠు వ్యాధిపై అవగాహన - Additional Image