Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సంజయ్‌ మృతికి ఆకర్ష్‌రెడ్డి నివాళి

    Author RAJANEETHI | 18 Sep 2026, 01:27 PM | ANDHRA PRADESH
    సంజయ్‌ మృతికి ఆకర్ష్‌రెడ్డి నివాళి

    రేణిగుంట, సెప్టెంబరు 18 (రాజనీతి): రేణిగుంట మండలం నేతాజీ కాలనీకి చెందిన సంజయ్‌ ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్‌రెడ్డి శుక్రవారం నేతాజీ కాలనీలోని ఆయన నివాసం వరకు చేరుకొని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంజయ్‌ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో రేణిగుంట టౌన్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌, మాజీ సర్పంచ్ నగేశం, హాసన్‌, నగేష్‌, లోహి, షబ్బీర్‌, మణి, శివమూర్తి, రమేష్‌, విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.