Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరులో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు...

    చిత్తూరులో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు...

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను బీజేపీ చిత్తూరు సెంట్రల్‌ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మిట్టూరులోని సుందర వినాయక స్వామి ఆలయంలో 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెస్సార్‌ సర్కిల్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌ నాయుడు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారని తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప అభియాన్‌’ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. సమాజ సేవే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.