Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కష్టం అంటే కదిలే నాయకుడు.. కజూర్ బాలాజీ!

    కష్టం అంటే కదిలే నాయకుడు.. కజూర్ బాలాజీ!

    చిత్తూరు(రాజనీతి): ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి గడపకు వచ్చిన సమస్యకు వెంటనే స్పందించే తత్వంతో టీడీపీ సీనియర్ నాయకుడు కజూర్ బాలాజీ ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ‘‘నేను ఉన్నాను.. మీకు అండగా ఉంటాను’’ అంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్‌మోహన్ సూచనల మేరకు కజూర్ బాలాజీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి టీడీపీకి ప్రజల మద్దతు ఇవ్వాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.ప్రజలతో నిత్యం మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న కజూర్ బాలాజీపై స్థానిక ప్రజల్లో అభిమానం పెరుగుతోందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ప్రజల సమస్యలపై స్పందించడం ఆయనకు బలంగా మారిందని పేర్కొంటున్నారు.రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్న కజూర్ బాలాజీకి టీడీపీ అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చి మంచి బాధ్యత అప్పగించాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో కజూర్ బాలాజీ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరుకుంటున్నారు.