Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

    Author RAJANEETHI | 11 Sep 2026, 02:03 PM | ANDHRA PRADESH
    అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

    పీలేరు సెప్టెంబర్ 11 (రాజనీతి): అన్నమయ్య జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీలేరు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత పశుగ్రాసం, 100 రోజుల ఉపాధి హామీ పనులు, నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని కోరారు. రైతులు, కూలీలను నిర్లక్ష్యం చేస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

    అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి - Additional Image