Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బోరు చెడిపోయినా పట్టించుకోని అధికారులు

    Author RAJANEETHI | 09 Sep 2026, 09:17 PM | ANDHRA PRADESH
    బోరు చెడిపోయినా పట్టించుకోని అధికారులు

    రేణిగుంట, సెప్టెంబర్ 9 (రాజనీతి): తూకివాకం పంచాయతీ పరిధిలోని ఎర్రామిరెడ్డిపాలెం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. గత మూడు రోజులుగా గ్రామంలోని బోరు పనిచేయకపోవడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. బోరు మరమ్మతులు చేసి తాగునీరు అందించాలని గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే చెడిపోయిన బోరును మరమ్మతు చేసి నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు పనిచేయని వీధి దీపాలను సరిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని గ్రామస్తులు హెచ్చరించారు.