Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సచివాలయంలో ‘నెట్’ కష్టాలు.. పెన్షన్ కోసం గంటల తరబడి పడిగాపులు

    Author RAJANEETHI | 09 Sep 2026, 07:24 PM | ANDHRA PRADESH
    సచివాలయంలో ‘నెట్’ కష్టాలు.. పెన్షన్ కోసం గంటల తరబడి పడిగాపులు

    వరదయ్యపాలెం సెప్టెంబర్ 9 (రాజనీతి): మండలంలోని మేజర్‌ పంచాయతీ సచివాలయంలో ఇంటర్నెట్‌ సదుపాయం లేక ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పెన్షన్‌ దరఖాస్తులు, ఇతర ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సిబ్బంది సొంత మొబైల్‌ డేటాతో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంటర్నెట్‌ బిల్లు చెల్లించినా కనెక్షన్‌ పునరుద్ధరించలేదని అధికారులు చెబుతున్నారు. రెండు సచివాలయాలకు ఒకే డిజిటల్‌ అసిస్టెంట్‌ ఉండటంతో పనిభారం పెరిగింది. అధికారులు వెంటనే స్పందించి ఇంటర్నెట్‌, సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.