Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మదనపల్లెలో ఆర్టీసీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయాలి: ఏఐటీయూసీ

    Author RAJANEETHI | 09 Sep 2026, 04:58 PM | ANDHRA PRADESH
    మదనపల్లెలో ఆర్టీసీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయాలి: ఏఐటీయూసీ

    మదనపల్లె సెప్టెంబర్ 9 (రాజనీతి): అన్నమయ్య జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన జిల్లాలోని కార్మిక సమస్యలను ప్రస్తావించారు. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, వలసలను అరికట్టాలని కోరారు. ఆర్టీసీ జిల్లా స్థాయి డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లెలో ఏర్పాటు చేయాలని, కార్మికులకు నెలకు రూ.31 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.