Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాంచాలి నగర్‌లో పెరిగిన కుక్కల బెడద

    Author RAJANEETHI | 08 Sep 2026, 09:15 PM | ANDHRA PRADESH
    పాంచాలి నగర్‌లో పెరిగిన కుక్కల బెడద

    రేణిగుంట, సెప్టెంబర్ 8 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని పాంచాలి నగర్‌లో కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి సమీపంలోని వీధుల్లోనే కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాల వెంట కుక్కలు పరుగులు తీయడంతో ప్రమాదాల భయం నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోందన్నారు. పంచాయతీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు కనిపించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.