Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బలహీనవర్గాల విద్యార్థులకు అన్యాయం చేయొద్దు...మలతోటి నరేష్

    Author RAJANEETHI | 08 Sep 2026, 04:50 PM | ANDHRA PRADESH
    బలహీనవర్గాల విద్యార్థులకు అన్యాయం చేయొద్దు...మలతోటి నరేష్

    అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 8 (రాజనీతి): బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు మలతోటి నరేష్‌ డిమాండ్‌ చేశారు. మెరుగైన నీట్‌ ర్యాంకులు సాధించిన రిజర్వేషన్‌ వర్గాల విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగా ఓపెన్‌ కేటగిరీ సీట్లు దక్కేలా పారదర్శక విధానం అమలు చేయాలని కోరారు. జీవో-102 కారణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియలో గందరగోళం ఏర్పడి మెరిట్‌ విద్యార్థులకు నష్టం జరిగిందన్న ఆందోళనలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. సీట్ల కేటాయింపు జాబితాలను పరిశీలించి, విద్యార్థులకు జరిగిన నష్టంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే అంశాన్ని పునఃపరిశీలించాలని, గత రెండు విద్యా సంవత్సరాల ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో లోకేష్‌, నిఖిల్‌, శివ తదితరులు పాల్గొన్నారు.