Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక విగ్రహ ప్రతిష్ఠకు పోలీసు అనుమతి తప్పనిసరి

    Author RAJANEETHI | 08 Sep 2026, 04:46 PM | ANDHRA PRADESH
    వినాయక విగ్రహ ప్రతిష్ఠకు పోలీసు అనుమతి తప్పనిసరి

    రొంపిచెర్ల సెప్టెంబర్ 8 (రాజనీతి): వినాయకచవితి పండుగ–2026 సందర్భంగా మండలంలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించదలచిన వారు తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందాలని రొంపిచెర్ల ఎస్‌ఐ కె. మధుసూదన్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయకచవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, చట్టబద్ధంగా నిర్వహించాలని కోరారు.