Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంటింటి కుష్ఠు వ్యాధి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

    Author RAJANEETHI | 08 Sep 2026, 04:43 PM | ANDHRA PRADESH
    ఇంటింటి కుష్ఠు వ్యాధి సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

    వాయల్పాడు, సెప్టెంబర్‌ 8 (రాజనీతి): ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలని చింతపర్తి పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ జులేఖ బేగం, డాక్టర్‌ సాయిశ్రీ కోరారు. ఆశా దినోత్సవం సందర్భంగా సర్వేకు సంబంధించిన అవగాహన సామగ్రి, బ్యానర్లను ఆవిష్కరించారు. స్పర్శలేని అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స అందిస్తామని, తొలిదశలో గుర్తిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు.