Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

    Author RAJANEETHI | 05 Sep 2026, 08:24 PM | ANDHRA PRADESH
    ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

    చౌడేపల్లి, సెప్టెంబర్ 5 (రాజనీతి): సత్య ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచిన రాజనాలబండ తిరునాళ్ల సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యే నూతనకాలువ అమర్‌నాథరెడ్డి, ఆయన సతీమణి రేణుకమ్మ శనివారం రాజనాలబండకు విచ్చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బండపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    ప్రసన్న ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు - Additional Image