Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గురువుల సేవలు సమాజానికి మార్గదర్శకం.. జూలియన్ రాజు

    Author RAJANEETHI | 05 Sep 2026, 03:43 PM | ANDHRA PRADESH
    గురువుల సేవలు సమాజానికి మార్గదర్శకం.. జూలియన్ రాజు

    రేణిగుంట సెప్టెంబర్ 5 (రాజనీతి): మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో గురుపూజోత్సవం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు డి. జూలియన్ రాజు, ముఖ్య సలహాదారు డి. అమ్ములు రాజు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలియన్ రాజు మాట్లాడుతూ ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గురువులు అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుగును నింపుతూ, విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత అత్యంత ముఖ్యమైన మార్గదర్శకులుగా నిలుస్తారని పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పి నవసమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్న గురువుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గురుపూజోత్సవం సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.