Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

    Author RAJANEETHI | 05 Sep 2026, 03:11 PM | ANDHRA PRADESH
    వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

    రేణిగుంట సెప్టెంబర్ 5 (రాజనీతి): వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రేణిగుంట మండలం అన్నాస్వామిపల్లి గ్రామంలోని చెరువును అర్బన్ సీఐ జయచంద్ర, ఎంపీడీవో రవిచంద్ర పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడింగ్, భద్రతా చర్యలు, విద్యుత్ వెలుగులు, రాకపోకల నియంత్రణ తదితర ఏర్పాట్లపై పరిశీలించారు. ప్రమాదాలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.