Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆదీస్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    Author RAJANEETHI | 03 Sep 2026, 06:19 PM | ANDHRA PRADESH
    ఆదీస్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    రేణిగుంట, సెప్టెంబర్‌ 3 (రాజనీతి): ఆదీస్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణుడు, గోపికల వేషధారణలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొని, కృష్ణుని పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణాష్టమి విశిష్టతను ఉపాధ్యాయురాలు నాగజ్యోతి విద్యార్థులకు వివరించారు. కరస్పాండెంట్‌ సుజాత, డైరెక్టర్‌ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు షాహిన, ఉపాధ్యాయులు నాగజ్యోతి, సాజీహా, అష్రాఫ్‌, అమీర్‌, సమీరా తదితరులు పాల్గొన్నారు.

    ఆదీస్‌ ఇండియన్‌ హైస్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - Additional Image