Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరులో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

    Author RAJANEETHI | 02 Sep 2026, 07:48 PM | ANDHRA PRADESH
    పీలేరులో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

    పీలేరు, సెప్టెంబర్‌ 2 (రాజనీతి): జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను పీలేరులో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కలప రవి, నియోజకవర్గ ఇన్‌చార్జి బెజవాడ దినేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిత పాఠశాలలో వికలాంగులు, విద్యార్థులకు ప్లేట్లు, పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం పెట్రోల్‌ బంక్‌ నుంచి మార్కెట్‌ యార్డు వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్‌ యార్డులో ఎల్‌ఈడీ వాల్‌పై పవన్‌ కళ్యాణ్‌ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని కార్యకర్తలు వీక్షించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    పీలేరులో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు - Additional Image