Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిరునాళ్లకు ముస్తాబవుతున్న రాజనాలబండ

    Author RAJANEETHI | 31 Aug 2026, 06:22 PM | ANDHRA PRADESH
    తిరునాళ్లకు ముస్తాబవుతున్న రాజనాలబండ

    చౌడేపల్లి, ఆగస్టు 31 (రాజనీతి): మండలంలోని వెంగలపల్లి గ్రామపంచాయతీ రాజనాలబండలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి, వీరాంజనేయస్వామి తిరునాళ్లకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రూప్‌ ఆఫ్‌ టెంపుల్స్‌ ఈవో రమణ తెలిపారు. 5న ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు అఖండజ్యోతి వెలిగిస్తారు. రాత్రి 9 గంటలకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. 6న ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు తిరునాళ్లు, ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈవో కోరారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి, గ్రామస్థులు పాల్గొన్నారు.