Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కట్టపుట్టాలమ్మ ఆలయ హుండీకి రూ.13.45 లక్షల ఆదాయం

    Author RAJANEETHI | 31 Aug 2026, 06:02 PM | ANDHRA PRADESH
    కట్టపుట్టాలమ్మ ఆలయ హుండీకి రూ.13.45 లక్షల ఆదాయం

    రేణిగుంట, ఆగస్టు 31 (రాజనీతి): రేణిగుంట మండలం కరకంబాడిలో వెలసిన ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ కట్ట పుట్టాలమ్మ ఆలయంలో ఐదు నెలల అనంతరం సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.13,45,600 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఆలయ చైర్మన్‌ పాడి రాజేంద్ర పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.