Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళల భద్రతపై అవగాహన తప్పనిసరి: సీఐ మంజునాథ్‌రెడ్డి

    Author RAJANEETHI | 31 Aug 2026, 03:17 PM | ANDHRA PRADESH
    మహిళల భద్రతపై అవగాహన తప్పనిసరి: సీఐ మంజునాథ్‌రెడ్డి

    రేణిగుంట, ఆగస్టు 31 (రాజనీతి): రేణిగుంట రూరల్‌ గాజులమండ్యం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో మహిళల భద్రత, సైబర్‌ నేరాలు, రక్షణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మంజునాథ్‌రెడ్డి, ఎస్‌ఐ హరీష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మంజునాథ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, ఫోన్‌ కాల్స్‌, సందేశాలకు స్పందించవద్దని తెలిపారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఐ తెలిపారు.