Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరం: సురేంద్రారెడ్డి

    Author RAJANEETHI | 29 Aug 2026, 07:44 PM | ANDHRA PRADESH
    శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరం: సురేంద్రారెడ్డి

    వీరబల్లి, ఆగస్టు 30 (రాజనీతి): విద్యార్థులు, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని విఆర్డీఎస్‌ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మై భారత్‌ కేంద్రం, విఆర్డీఎస్‌ ఆధ్వర్యంలో ఎస్‌డీకేఆర్‌ డిగ్రీ కళాశాలలో వాలీబాల్‌, కబడ్డీ పోటీలు నిర్వహించారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సురేంద్రారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఒక్కటే లక్ష్యంగా కాకుండా క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలని సూచించారు. పోటీలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నెహవిల్‌ బాషా, రవిశేఖర్‌రెడ్డి, సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

    శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరం: సురేంద్రారెడ్డి - Additional Image