Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బోయకొండ గంగమ్మ క్షేత్రంలో ఘనంగా చండీ హోమం

    Author RAJANEETHI | 27 Aug 2026, 06:26 PM | ANDHRA PRADESH
    బోయకొండ గంగమ్మ క్షేత్రంలో ఘనంగా చండీ హోమం

    చౌడేపల్లి, ఆగస్టు 27 (రాజనీతి): పౌర్ణమి సందర్భంగా దిగువపల్లి గ్రామంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో గురువారం చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పూజలు, హోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన ఉపకమిషనర్‌, కార్యనిర్వహణాధికారి ఏకాంబరం వారికి ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.