Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చరిత్రకు సాక్షిగా రేణిగుంట రైల్వే జంక్షన్‌.. అభివృద్ధి పథంలో అప్రతిహత ప్రస్థానం

    Author RAJANEETHI | 26 Aug 2026, 01:17 PM | ANDHRA PRADESH
    చరిత్రకు సాక్షిగా రేణిగుంట రైల్వే జంక్షన్‌.. అభివృద్ధి పథంలో అప్రతిహత ప్రస్థానం

    రేణిగుంట, ఆగస్టు 26 (రాజనీతి): దక్షిణ భారత రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రేణిగుంట జంక్షన్‌ నేటితో 164 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1862 ఆగస్టు 26న ఇక్కడ రైల్వే స్టేషన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో పరిమిత సౌకర్యాలతో ఉన్న ఈ కేంద్రం కాలక్రమేణా విస్తరించి, నేడు ఉత్తర–దక్షిణ రైలు మార్గాలను కలిపే కీలక కూడలిగా ఎదిగింది.
    చెన్నై–ముంబయి రైల్వే అనుసంధానంలో భాగంగా 1859లో రేణిగుంట–పూడి మధ్య సుమారు 10 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1862 ఆగస్టు 27న తొలిసారిగా ఆవిరి రైలు రేణిగుంటలో పరుగులు తీసింది. అప్పటి నుంచి ప్రయాణికులు, సరకు రవాణాకు ఈ జంక్షన్‌ ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. నేడు వందలాది మంది సిబ్బందితో నిరంతరం కార్యకలాపాలు సాగుతున్న రేణిగుంట రైల్వే కేంద్రం పరిసర ప్రాంతాల ఆర్థిక, వాణిజ్య అభివృద్ధికి కూడా ఊతమిచ్చింది. పాలు, ఎరువులు, రేషన్‌ బియ్యం తదితర సరుకుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. కొవిడ్‌ సమయంలో రేణిగుంట నుంచి ఢిల్లీకి పాల రవాణా జరగడం విశేషం. రైల్వే కోచ్‌ల మరమ్మతులకు సంబంధించిన సీఆర్ఎస్‌ కార్యకలాపాలు కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి.