Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంకుతోటపల్లిలో వైభవంగా మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ

    Author RAJANEETHI | 26 Aug 2026, 11:45 AM | ANDHRA PRADESH
    అంకుతోటపల్లిలో వైభవంగా మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ

    చౌడేపల్లి, ఆగస్టు 26 (రాజనీతి): ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లి గ్రామంలో గ్రామదేవత మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బోయకొండ ఆలయ చైర్మన్‌ ఎస్‌.కె.వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి రతీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దంపతులను గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.