Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సేవలో తగ్గేదేలే.. కాణిపాకం అభివృద్ధిలో ఈఓ పెంచల కిషోర్‌ దూకుడు!

    సేవలో తగ్గేదేలే.. కాణిపాకం అభివృద్ధిలో ఈఓ పెంచల కిషోర్‌ దూకుడు!

    చిత్తూరు:కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఈవో పెంచల కిషోర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆలయ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భక్తుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.సామాన్య భక్తుడే బాస్‌ అన్న విధంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. రద్దీ సమయాల్లో క్యూలైన్ల నిర్వహణ, దర్శన సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం, భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని సమన్వయం చేయడం వంటి అంశాల్లోనూ ఈవో చొరవ చూపుతున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలయ ప్రతిష్ఠను మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు.అధికారిగా కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వడం, భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం ఆయన పనితీరులో ప్రత్యేకతగా నిలుస్తోంది. ఆలయ ఆదాయాన్ని సద్వినియోగం చేస్తూ భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.కాణిపాకం క్షేత్రానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఈవో పెంచల కిషోర్‌ ముందుకు సాగుతున్నారని భక్తులు అభినందిస్తున్నారు. పాలనలో వేగం.. అభివృద్ధిలో దూకుడు.. భక్తుల సేవలో అంకితభావం అనే నినాదంతో కాణిపాకం ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.