Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భార్య తిట్టిందని గొంతు కోసుకున్న భర్త

    Author RAJANEETHI | 25 Aug 2026, 08:35 PM | ANDHRA PRADESH
    భార్య తిట్టిందని గొంతు కోసుకున్న భర్త

    చౌడేపల్లి, ఆగస్టు 25 (రాజనీతి): భార్య తిట్టిందనే మనస్తాపంతో భర్త గొంతు కోసుకున్న ఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దిగువపల్లి పంచాయతీ యానాదిపాలెంకు చెందిన గుర్రప్ప (20) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన గుర్రప్ప కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు, కుటుంబ సభ్యులు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.