Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పీలేరులో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు

    Author RAJANEETHI | 25 Aug 2026, 07:45 PM | ANDHRA PRADESH
    పీలేరులో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు

    పీలేరు, ఆగస్టు 26 (రాజనీతి): నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవల కోసం క్షేత్రస్థాయి సిబ్బంది మెరుగైన నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారి డా.బి.రమేష్‌బాబు సూచించారు. మంగళవారం తలుపుల పీహెచ్‌సీ పరిధిలోని కావలిపల్లె సచివాలయంలో ఆరోగ్య సేవలను బృందం పరిశీలించింది. గర్భిణీ సేవలు, కౌమార బాలికల హెచ్‌బీ పరీక్షలు, ఎంసీపీ కార్డులు, ఆర్‌సీహెచ్‌, హెచ్‌ఎంఐఆర్‌ రికార్డులు, ఆన్‌లైన్‌ వివరాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    పీలేరులో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు - Additional Image