Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేకాట శిబిరంపై దాడి.. 24 మంది అరెస్ట్‌

    Author RAJANEETHI | 23 Aug 2026, 05:13 PM | ANDHRA PRADESH
    పేకాట శిబిరంపై దాడి.. 24 మంది అరెస్ట్‌

    చౌడేపల్లి, ఆగస్టు 22 (రాజనీతి): అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని బోయకొండ భవానీనగర్‌లో నిర్వహిస్తున్న భారీ పేకాట శిబిరంపై రూరల్‌ సర్కిల్‌ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా 24 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పి.సాయిప్రసాద్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఐ జి.చిన్నరెడ్డెప్ప, సిబ్బంది కలిసి డిష్‌ సూరి రూముల వెనుక వీధి దీపాల వెలుగులో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేశారు. ఈ శిబిరంలో సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.