Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అంగన్వాడీలలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు శ్రీకారం

    Author RAJANEETHI | 12 Aug 2026, 02:32 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    అంగన్వాడీలలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు శ్రీకారం

    రాజనీతి | చౌడేపల్లి | ఆగస్టు 12, 2026 :
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు శ్రీకారం చుట్టిన "సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్టులో భాగంగా చౌడేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానక ఉన్నత పాఠశాల ఆవరణంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 'ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ` కింద "జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు శిక్షణను నిర్వహిస్తున్నారు.
    ఈ సందర్భంగా సూపర్వైజర్లు సులోచన రాధలు మాట్లాడుతూ
    అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా పరిజ్ఞానాన్ని చిన్న వయసులోనే పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు
    120 రోజుల పాటు జరిగే ఈ సర్టిఫికేట్ కోర్సు ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆటపాటలతో కూడిన ఆధునిక ప్రాథమిక బోధనా పద్ధతులు పిల్లల మానసిక వికాసానికి తోడ్పడే నైపుణ్యాలపై ప్రత్యక్ష శిక్షణ ఇస్తారన్నారు అనంతరం ప్రభుత్వం అంగనమాడీలకు ఇస్తున్న ప్రాధాన్యతను అదేవిధంగా పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో శిక్షకులు ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీలు పాల్గొన్నారు

    అత్యధికంగా చదివినవి