Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దగ్గు మాత్రమే టీబీ లక్షణం కాదు: డాక్టర్ జులేఖ బేగం

    Author RAJANEETHI | 10 Aug 2026, 04:11 PM | ANDHRA PRADESH
    దగ్గు మాత్రమే టీబీ లక్షణం కాదు: డాక్టర్ జులేఖ బేగం

    వాయల్పాడు, ఆగస్టు 10 (రాజనీతి): దగ్గు ఒక్కటే టీబీ వ్యాధి లక్షణం కాదని చింతపర్తి పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ జులేఖ బేగం, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ తెలిపారు. టీబీ ముక్త్ భారత్–2.0లో భాగంగా చింతపర్తి రైతు సేవా కేంద్రంలో హైరిస్క్‌ వర్గాలకు అవగాహన, స్క్రీనింగ్‌ నిర్వహించారు. 162 మందికి ఉచిత ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు చేశారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు, ఛాతినొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయితే ఆరు నెలలపాటు మందులు ఉచితంగా అందిస్తామని తెలిపారు.

    అత్యధికంగా చదివినవి