Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ రాజముద్రతో రైతుల పాస్ పుస్తకాలు...ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

    ప్రభుత్వ రాజముద్రతో రైతుల పాస్ పుస్తకాలు...ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల భూములకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాలను ప్రభుత్వ రాజ్యముద్రతో అందిస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం గుడిపాల మండలం దిగువ కొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకులు రైతుల భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలపైనా వారి ఫోటోలు పెట్టుకున్నారని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ రాజ్యముద్రతో పాస్ పుస్తకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా భూ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, ఎంపీపీ గోళ్ల హరి, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బానాయుడు, చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు సీకే లావణ్య, ధనసింగ్, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, ప్రతాప్ నాయుడు, బాలాజీ నాయుడు, రూప్ కూమార్, లీలావతి, పీటర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.