Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబును ఆహ్వానించిన అయూబ్ ఖాన్

    టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబును ఆహ్వానించిన అయూబ్ ఖాన్

    పుంగనూరు,రాజనీతి, ఆగస్టు 04: డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం హెల్త్ & ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పి.ఇ.ఎస్. హాస్పిటల్ (కుప్పం) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం పుంగనూరులో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
    ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీ చల్లా బాబు గారిని ట్రస్ట్ ప్రతినిధి పి. అయూబ్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి, శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించాలని ఆహ్వానించారు. ప్రజా సంక్షేమం కోసం నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ మెగా కంటి వైద్య శిబిరం ఆగస్టు 9వ తేదీ ఉదయం 10 గంటలకు తాటిమకులపాళ్యం రోడ్డులోని ఎంసీవీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి