Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మండల అభివృద్ధికి అధికారుల సహకారం అవసరం: మాదిరాజు లక్ష్మణ రాజు

    Author RAJANEETHI | 03 Aug 2026, 12:41 PM | ANDHRA PRADESH
    మండల అభివృద్ధికి అధికారుల సహకారం అవసరం: మాదిరాజు లక్ష్మణ రాజు

    చౌడేపల్లి, ఆగస్టు 3 (రాజనీతి): మండల సర్వతోముఖాభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు (పతిరాజు) కోరారు. చౌడేపల్లి పరిపాలన భవనంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, కార్యాలయాలకు వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల హరి రాయల్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

    మండల అభివృద్ధికి అధికారుల సహకారం అవసరం: మాదిరాజు లక్ష్మణ రాజు - Additional Image