Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కరాటే విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు

    Author RAJANEETHI | 02 Aug 2026, 03:50 PM | ANDHRA PRADESH
    కరాటే విజేతలను సత్కరించిన బీజేపీ నాయకులు

    పుంగనూరు, ఆగస్టు 2 (రాజనీతి): మైసూరులో జరిగిన అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చి అవార్డులు సాధించిన పుంగనూరుకు చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీశ్ రాజు, పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. కరాటే కోచ్ మహేష్ సేవలను అభినందిస్తూ, విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం పుంగనూరుకు గర్వకారణమని పేర్కొన్నారు. మహిళల ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతో అవసరమని, ప్రతిభావంతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి