Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లిపాలతోనే బిడ్డ సంపూర్ణ మానసిక వికాసం: వైద్యులు

    Author RAJANEETHI | 01 Aug 2026, 06:48 PM | ANDHRA PRADESH
    తల్లిపాలతోనే బిడ్డ సంపూర్ణ మానసిక వికాసం: వైద్యులు

    తలుపుల, ఆగస్టు 1 (రాజనీతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బండ్లవంకలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారులు డా. శ్రీగిరీష, డా. చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ, ప్రసవించిన అరగంటలోపు ముర్రుపాలు ఇవ్వడం ద్వారా శిశువుకు వ్యాధినిరోధక శక్తి, మెరుగైన మానసిక వికాసం లభిస్తుందని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య, పీహెచ్‌ఎన్ కుసుమ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి