Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చాందిని బండ్ల నిర్వాహకులకు సీఐ అనిల్ కుమార్ సూచనలు

    Author RAJANEETHI | 01 Aug 2026, 12:09 PM | ANDHRA PRADESH
    చాందిని బండ్ల నిర్వాహకులకు సీఐ అనిల్ కుమార్ సూచనలు

    కలికిరి, ఆగస్టు 1 (రాజనీతి): శ్రీ ఎల్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా చాందిని బండ్ల నిర్వాహకులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలికిరి సీఐ ఎస్. అనిల్ కుమార్ సూచించారు. ట్రాక్టర్లకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, డ్రైవర్లకు లైసెన్స్ ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. చాందిని బండ్ల ముందు అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి