Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సూపర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్

    Author RAJANEETHI | 01 Aug 2026, 11:53 AM | ANDHRA PRADESH
    సూపర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదాల నివారణపై మాక్‌డ్రిల్

    రేణిగుంట, ఆగస్టు 1 (రాజనీతి): రేణిగుంట పట్టణంలోని శేఖర్ సూపర్ మార్కెట్‌లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శనివారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందికి అగ్నిమాపక పరికరాల వినియోగంపై ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్విప్‌మెంట్‌ను ఎలా ఉపయోగించి మంటలను అదుపు చేయాలో డెమో ద్వారా వివరించారు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, థియేటర్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో ఇలాంటి మాక్‌డ్రిల్‌లు దశలవారీగా నిర్వహిస్తూ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.