Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష్

    Author RAJANEETHI | 31 Jul 2026, 08:14 PM | ANDHRA PRADESH
    తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష్

    పీలేరు, జూలై 31 (రాజనీతి): ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష్ క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ప్రసవించిన అరగంటలోపే శిశువుకు ముర్రుపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. తల్లిపాల ప్రయోజనాలను ప్రతి తల్లికి వివరించి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

    తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష్ - Additional Image
    అత్యధికంగా చదివినవి