Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలి.. డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం: సీఎండీ శివశంకర్

    Author RAJANEETHI | 31 Jul 2026, 04:52 PM | ANDHRA PRADESH
    ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయాలి.. డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం: సీఎండీ శివశంకర్

    పీలేరు, జూలై 31 (రాజనీతి): విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఆర్‌డీఎస్‌ఎస్ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పీలేరు, కలికిరి ప్రాంతాల్లోని సబ్‌స్టేషన్లను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. రైతులకు మంజూరైన కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను గడువులోగా విడుదల చేయాలని సూచించారు. అలాగే డిజిటల్ విద్యుత్ బిల్లు చెల్లింపులను ప్రోత్సహిస్తూ నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

    అత్యధికంగా చదివినవి