Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గ్యారంపల్లి ఘటనలో చర్యలు ఎప్పుడు?: ఎన్‌ఎస్‌యూఐ ప్రశ్న

    Author RAJANEETHI | 31 Jul 2026, 04:03 PM | ANDHRA PRADESH
    గ్యారంపల్లి ఘటనలో చర్యలు ఎప్పుడు?: ఎన్‌ఎస్‌యూఐ ప్రశ్న

    పీలేరు, జూలై 31 (రాజనీతి): గ్యారంపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీసీ జారీ సందర్భంగా విద్యార్థి నుంచి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల ఘటనలో బాధ్యులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో జిల్లా విద్యాశాఖ వెల్లడించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ పూర్తయితే నివేదికను బహిర్గతం చేసి, తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదు చేసిన విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. చర్యల్లో జాప్యం విద్యార్థుల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

    అత్యధికంగా చదివినవి