Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నీళ్ల విరోచనాల నియంత్రణలో ఓఆర్‌ఎస్ సంజీవని: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ

    Author RAJANEETHI | 29 Jul 2026, 01:00 PM | ANDHRA PRADESH
    నీళ్ల విరోచనాల నియంత్రణలో ఓఆర్‌ఎస్ సంజీవని: డిప్యూటీ హెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ

    వాయల్పాడు, జూలై 29 (రాజనీతి): ప్రపంచ ఓఆర్‌ఎస్ దినోత్సవం సందర్భంగా చింతపర్తి గ్రామంలో తల్లులకు ఓఆర్‌ఎస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, నీళ్ల విరోచనాల వల్ల కలిగే నిర్జలీకరణాన్ని నివారించడంలో ఓఆర్‌ఎస్ ద్రావణం సంజీవనిలా పనిచేస్తుందని తెలిపారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఓఆర్‌ఎస్ ద్రావణం తయారీ విధానాన్ని వివరించి ప్యాకెట్లు పంపిణీ చేశారు. తాగునీటిని మరిగించి తాగడం, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, చిన్నారులకు తల్లిపాలు ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల వద్ద ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

    అత్యధికంగా చదివినవి