ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గోదావరిలో తగ్గిన జలాలు రైతులకు ప్రభుత్వం అత్యవసర సూచనలు
అమరావతి: రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిలోకి నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగునీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. నీటిపారుదల శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం భారీగా లోటులో ఉంది. గోదావరిలో జూలై నెలలో సాధారణంగా ఉండే ప్రవాహంతో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ నీరు మాత్రమే వస్తోందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి గత కొన్ని దశాబ్దాల్లో అరుదుగా నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వం తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూనే,...