పేపర్ లీక్లపై కేంద్రం ఉక్కుపాదం.. లోక్సభలో కొత్త సవరణ బిల్లు ప్రవేశపెట్టింది!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా పరీక్షలు (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026ను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించారు. కొత్త బిల్లు ప్రకారం పేపర్ లీక్ కేసుల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడం, ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో విచారణ నిర్వహించడం, అప్పీళ్లను కూడా నిర్దిష్ట గడువులో పరిష్కరించడం వంటి నిబంధనలు తీసుకురానున్నారు. అలాగే, పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఏజెన్సీలు, సేవలందించే సంస్థలపై మరింత కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించే...